Header Banner

కాళ్ళ వాపులు, నొప్పులు.. కిడ్నీ సమస్యలే కాదు! ఇవి కూడా కారణాలు కావచ్చు!

  Mon May 26, 2025 12:36        Health

చాలామంది కాళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో బాధపడుతూ ఉంటారు. కాళ్ళలో నీరు చేరి నొక్కితే సొట్టలు పడుతున్నాయని, అనారోగ్య సమస్య వచ్చిందని తెగ దిగులు పడుతూ ఉంటారు. అయితే కాళ్ల వాపులు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న కారణాలతో కూడా కాళ్లు వాపులు వస్తూ ఉంటాయి. కదలకుండా కూర్చుని పని చేసే వాళ్ళకి, లేదా ఎక్కువ దూరం ప్రయాణాలు చేసే వాళ్ళకి కాళ్లవాపు వస్తూ ఉంటుంది.

 


కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి?

అయితే నొప్పులు ఎక్కువగా ఉంటేనే కాళ్ల వాపు గురించి పట్టించుకుంటారు. లేదంటే కాళ్ల వాపు గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. అయితే కాళ్ల వాపుకి గల కారణాలు ఏమిటి? ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే కాళ్ల వాపులు వస్తాయి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

 


కిడ్నీ సమస్యలే కాదు కాళ్ళ వాపులకు అనేక కారణాలు

చాలామంది కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు మాత్రమే కాళ్ళ వాపులు వస్తాయని చెబుతూ ఉంటారు. కానీ కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు కాళ్ల వాపు రావడం సాధారణమైన విషయం అయినప్పటికీ కేవలం కిడ్నీ సమస్య వల్లనే కాళ్ల వాపులు రావు. ఇంకా కాళ్ళ వాపులకు అనేక కారణాలు కూడా ఉన్నాయి.కాళ్ల రక్తనాళాలు లీక్ అవ్వడం వల్ల కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది.

 


ఈ కారణాలతోనూ కాళ్ళ వాపులు

కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల, నొప్పులు తగ్గే టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కూడా కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. గుండె సమస్య ఉన్నప్పుడు, లివర్ పనితీరు తగ్గినప్పుడు, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో డయాబెటిక్ న్యూరోపతి వంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ల వాపు వచ్చే అవకాశం ఉంది.

 


హార్మోన్ల మార్పు కారణంగా కాళ్ళ వాపులు

కాళ్ల రక్తనాళాలలో వాల్వ్స్ పనితీరు సరిగా లేకపోతే కాళ్లు, పాదాలలో నీరు చేరి కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో హార్మోన్ల ఇన్ బాలన్స్ వల్ల కూడా కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంది .ఇక గర్భవతిగా ఉన్న సమయంలో కూడా శరీరంలో హార్మోన్ల మార్పు కారణంగా కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంది. కాళ్ళ వాపులను నిర్లక్ష్యం చెయ్యొద్దు. అవి ఎందుకు అలా వచ్చాయో తెలుసుకుని సరైన వైద్యుల సలహాలను తీసుకుని జాగ్రత్త పడితే మంచిది.

 

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.

 

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 ఇది కూడా చదవండి: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం! మహానాడు వేదికగా ... లోకేష్ కు పట్టం!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

 

కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!

 

తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత హల్‌చల్‌.. 12 ఏళ్లలోపు చిన్నారులను.!

 

జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!

 

వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!

 

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #HealthTips #SwollenLegs #LegPain #KidneyHealth #HealthAwareness